NEWSANDHRA PRADESH

ఏపీకి బాబు నాయ‌క‌త్వం కావాలి

Share it with your family & friends

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

పిఠాపురం – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చంద్ర‌బాబు నాయుడు లాంటి అనుభ‌వం క‌లిగిన నాయ‌కత్వం ప్ర‌స్తుతం అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప్ర‌సంగించారు. జ‌న‌సేన‌, టీడీపీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు.

ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయోలాభిషులు బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల‌కు అండ‌గా నిల‌వాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరారు. మూడు పార్టీల క‌లివిడ‌త‌నం పోలింగ్ బూత్ ల‌లో క‌నిపించాల‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా జ‌న‌సేన పార్టీ రిస్క్ తీసుకుంద‌ని చెప్పారు. క‌ష్ట కాలంలో తెలుగుదేశం పార్టీకి అండ‌గా నిలిచింద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడును కావాల‌ని ప‌నిగ‌ట్టుకుని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ వేధింపుల‌కు గురి చేసింద‌ని ఆరోపించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న వంతుగా సాయం చేశాన‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ నేత‌ల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొని ప్ర‌సంగించారు.