ఏపీలో కూటమిదే గెలుపు పక్కా
స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
మంగళగిరి – ఏపీలో జరిగే ఎన్నికల్లో జనసేన కూటమికి 175 స్థానాలకు గాను 170 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు నేతలు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన పార్టీ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో సంక్షేమం పేరుతో దోపిడీకి పాల్పడ్డారంటూ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని జనం డిసైడ్ అయ్యారని అన్నారు. రాష్ట్రంలో మార్పు సహజమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. వీటిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు .
ఇప్పటికే 7 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకు వచ్చారని, సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి సర్కార్ మోసానికి పాల్పడిందని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తుండడంతో కూటమికి సవాల్ గా మారిందని, ప్రతి ఒక్కరు కిలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.