మాదే అధికారం కూటమిదే పీఠం
జనసేన పార్టీ చీప్ పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీలో ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వ బోతున్నారని స్పష్టం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి శాసన సభ ఎన్నికల్లో సత్తా చాటనుందని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇది త్వరలో తేల బోతోందన్నారు. ఇక రాచరిక పాలనకు స్వస్తి పలికేందుకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు జనసేనాని.
ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజా గళం సభను సక్సెస్ చేశారని ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
175 శాసన సభ స్థానాలలో తమ కూటమికి 140కి పైగా సీట్లు వస్తాయని , 25 లోక్ సభ స్థానాలలో కనీసం 18కి పైగా ఎంపీ సీట్లు రాక తప్పదని పేర్కొన్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తమ కూటమి రికార్డు సృష్టించేందుకు సిద్దంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. సంక్షేమ పథకాల పేరుతో ఏపీని లూటీ చేశారని ఆరోపించారు. రాచరిక పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.