బాబు నాయకత్వంలో ఏపీ జెట్ స్పీడ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కలెక్టర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు.
బుధవారం జిల్లాల కలెక్టర్ల సదస్సులో పాల్గొని ప్రసంగించారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. మూలాలనే పెకలించేసిందని మండిపడ్డారు. భారీగా అవకతవకలకు పాల్పడిందని ధ్వజమెత్తారు.
ప్రజలు తమపై బృహత్తర బాధ్యత పెట్టారని అన్నారు. తాము పాలసీలు మాత్రమే తీసుకురాగలమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ లేనని అన్నారు.
గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు.. ఎన్నో పనులు చేయించారని పేర్కొన్నారు. ఇంతమంది ఐఏఎస్ లు ఉండీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి పోయారంటూ వాపోయారు.
గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్నారు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందని చెప్పారు పవన్ కళ్యాణ్.
రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారని . ఆయన నాయకత్వంలో పని చేయడం మన అదృష్టమని కొనియాడారు.