స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఎప్పటి నుంచో తెలుసన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని అన్నారు. ఆయనకు తెలుగు సినీ ఇండస్ట్రీతో చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పారు. టికెట్ల రేట్లు పెంచి ఎంతో సహకరించారని కొనియాడారు. బన్నీ, రామ్ చరణ్, రాణా లాంటి హీరోల కంటే తను సీనియర్ అన్నారు.
మంగళవారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పుష్పకు భారీ ఎత్తున డబ్బులు వచ్చాయని, దీనికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు. రాజకీయాల పరంగా అభిప్రాయాలు, భేదాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉండడంలో తప్పు లేదన్నారు. కానీ వ్యక్తిగతంగా తాను సీఎం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం.
ఇదే సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండేదన్నారు. కానీ అలా చేయక పోవడం పూర్తిగా తప్పేనన్నారు.