పందిళ్లపల్లి శ్రీనివాస్ త్యాగం స్పూర్తి దాయకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. అడవుల రక్షణకు కృషి చేస్తూ స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ఏపీకి చెందిన పందిళ్లపల్లి శ్రీనివాస్ వీర మరణం పొందారని, ఆయన చేసిన త్యాగం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందన్నారు.
అటవీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిన మహానీయుడు అని కొనియాడారు. పందిళ్లపల్లి శ్రీనివాస్ త్యాగానికి గుర్తుగా రాష్ట్ర అటవీ శాఖ అమర వీరుల సంస్మరణ దినోత్సవం నవంబర్ 10న జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆదివారం ఏపీ రాష్ట్ర అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవం చేపట్టారు.
అమర వీరుల కుటుంబాలకు అందించే సహాయంపై అధికారుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన త్యాగానికి గుర్తుగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నగరవణంలో ఒకదానిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అటవీ శాఖ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు అధునాతన సదుపాయాలు, సామగ్రి అందజేస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల.