పవన్ కళ్యాణ్ నెట్టింట్లో వైరల్
దూకుడు పెంచిన డిప్యూటీ సీఎం
అమరావతి – నటుడిగా ఫుల్ మార్కులు కొట్టిసేన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదెల డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర కనబర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బలంగా అంతకు మించి ఆక్టోపస్ లాగా పాతుకు పోయిన వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని , ఆయన పరివారాన్ని అడ్రస్ లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఒకానొక దశలో బలహీనంగా తయారైన తెలుగుదేశం పార్టీకి , భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు కల్పించిన ఘనత పవన్ కళ్యాణ్ దేనని చెప్పక తప్పదు. మనోడు ఇరు పార్టీలతో సమన్వయం చేయడంలోనూ , అటు కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షాతో చర్చలు జరిపేలా పొత్తు కుదిరేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు కలిపి 165 సీట్లను కైవసం చేసుకున్నాయి. ఇది ఓ రికార్డు. అంతే కాదు జనసేన తాను పోటీ చేసిన 21 శాసన సభ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే వంద శాతం సక్సెస్ రేటును సాధించింది. ఇది కూడా ఓ రికార్డ్. తాజాగా తను ఓ చేత్తో వెంకటేశ్వర స్వామి, మరో చేత్తో కత్తిని పట్టుకుని ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎంతైనా పవనా మజాకా అంటున్నారు నెటిజన్లు.