కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆయన ఉన్నట్టుండి ఈ కామర్స్ సంస్థలపై సీరియస్ అయ్యారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెజాన్ గిఫ్ట్ కార్డు వాడక పోతే అవి నిరుపయోగ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నట్లు తనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీని వల్ల కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా అవుతోందని అన్నారు.
ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం గిఫ్ట్ కార్డులకు ఏడాది పరిమితి ఉండాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి కేవైసీ లింక్ అయిన బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేయాలన్నారు. ఓ వైపు అత్యధిక లాభాలు గడిస్తున్న ఈ కామర్స్ సంస్థలు ప్రజా ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల.
తమకు తోచినట్లుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని, తమ కార్యకలాపాలను నిర్వహిస్తామని అనుకుంటే కుదరదని హెచ్చరించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రతి ఒక్క ఈ కామర్స్ సంస్థ వినియోగదారుల హక్కులను కాపాడే విధంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. తమ కూటమి సర్కార్ త్వరలోనే ఓ పాలసీని తీసుకు వచ్చే ఆలోచనలో ఉందన్నారు డిప్యూటీ సీఎం.