NEWSANDHRA PRADESH

కాకినాడ పోర్టు అధికారుల‌పై ప‌వ‌న్ క‌న్నెర్ర‌

Share it with your family & friends

అస‌లు ఎస్పీ సెలవులో వెళ్ల‌డం ఏంటి..?

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న ఆక‌స్మికంగా కాకినాడ పోర్టును త‌నిఖీ చేశారు. అక్ర‌మంగా బియ్యం ర‌వాణా కావ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను వ‌స్తున్నాన‌ని తెలిసి ఎస్పీ సెల‌వులో ఎలా వెల‌తాడంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న సెలువులో వెళ్ల‌డం అనుమానం క‌లిగిస్తోంద‌న్నారు.

పోర్ట్ అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందేన‌ని స్ప‌ష్టంచేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. కోర్టులకు వెళ్లి త‌న‌ మీద ఒత్తిడి తీసుకు వ‌ద్దామ‌ని, త‌న‌ను రానివ్వకుండా చూద్దాం అనుకుంటే కుదరదన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్రతీ ఒక్కరూ సమాధానం చెప్పాల్సిందేన‌ని మండిప‌డ్డారు.

స్మగ్లింగ్ కు అలవాటు పడిన వారు ఈరోజు బియ్యం, రేపు డ్రగ్స్, తరవాత RDX, అక్రమ ఆయుధాలు ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే ప్రమాదం ఉంద‌న్నారు. గతంలో ముంబై లో అలా చేస్తే తరవాత ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు అన్నారు.

ముంబై మహా నగరంలో కసబ్ లాంటి ఉగ్రవాదులు, హైదారాబాద్ గోకుల్ చాట్ బండార్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు ఒక్క‌సారి గుర్తు చేసుకోవాల‌ని అన్నారు. విశాఖ పోర్టు లో 25 వేల కిలోల హెరాయిన్ దొరికిందని, దీనిని బ‌ట్టి చూస్తే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంద‌న్నారు.