పవన్ కళ్యాణ్ ప్రశంసలు
అమరావతి – సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రేవంత్ కాబట్టే హీరోను అరెస్ట్ చేయగలిగారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హీరో థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేదన్నారు. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి ఉంటే బాగుండేదన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని అన్నారు.
సోమవారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ , రష్మిక మందన్నా, శ్రీలీల కలిసి నటించిన సుకుమార్ తీసిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా రేవతి మహిళ చని పోగా కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటన విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ పరామర్శించి ఉంటే బావుండేదన్నారు. విచిత్రం ఏమిటంటే గోటితో పోయేదానిని గొడ్డలి దాకా తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. వెంటనే పరామర్శించకుండా ఉండడం పద్దతి కాదన్నారు. ఒక రకంగా మానవతా దృక్ఫథం లోపించినట్లయిందన్నారు .