రేవతి మృతి బాధాకరం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి స్పందించారు. ఈ ఘటనలో రేవతి మృతి చెందడం బాధాకరమన్నారు. సినిమా చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవడం తనను మరింత కలిచి వేసిందన్నారు. మృతి చెందిన వెంటనే ఎవరైనా వెళ్లి పరామర్శించి ఉంటే బావుండేదన్నారు. అల్లు అర్జునే కాదు ఇంకా ఎవరైనా ఎందుకు వెళ్ల లేదంటూ ప్రశ్నించారు. రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని అన్నారు.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రేవంత్ సర్కార్ అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి స్పందించి ఘటన జరిగి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు నోరు విప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.