జగన్ గాయం నాటకం బూటకం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేపట్టిన వారాహి వాజయ యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. చిన్న గాయమైతే దానిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, అదేదో మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ గాయం అయినట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.
ఇది నిజంగా తగిలిన గాయం మాత్రం కాదన్నారు. జగన్ రెడ్డి గాయమైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఒక రకంగా చెప్పాలంటే నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు జనసేనాని. అమర్ నాథ్ గౌడ్ ను చెరకు తోటలో నిర్దాక్షిణ్యంగా కాల్చేసినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు.
30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోతే ఎందుకని సీఎం జగన్ రెడ్డి మిన్నకుండి పోయారని నిలదీశారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, ఇక ఆయన ఆటలు సాగవని హెచ్చరించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు పవన్ కళ్యాణ్.