డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు పని చేసినా పదవి దక్కలేదన్నారు. మార్చిలో ఎమ్మెల్సీ అవుతారని, ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటామన్నారు. తాను ఏ కులం, ఏ వర్గానికి చెందిన వారని తాను చూడ లేదన్నారు. కందుల దుర్గేష్ ది ఏ కులమో తనకు తెలియదని చెప్పారు. నాదెండ్ల స్థానంలో ఎవరు పని చేసినా పదవి దక్కేదన్నారు.
ఒకవేళ తాను తల్చుకుంటే తన సోదరుడికి మంత్రిగా ఛాన్స్ దక్కేది కాదా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. సోమవారం చిట్ చాట్ లో కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఒకవేళ తన సామాజిక వర్గం కాక పోయినా ఆ స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇచ్చేవాడినని చెప్పారు.
తాను కేవలం కాపు కులస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబదద్మన్నారు. పదవులు ఇచ్చేటప్పుడు సామాజిక వర్గాల వారు ఎవరనే దానిపై తాను పట్టించు కోనని అన్నారు. కలిసి కట్టుగా ముందు నుంచీ పార్టీ కోసం పని చేసిన వాళ్లకే ప్రయారిటీ ఇస్తానని ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
తనపై కామెంట్స్ చేసే వాళ్ల గురించి తాను పట్టించుకోనంటూ స్పష్టం చేశారు.