డిప్యూటీ సీఎంపై పవన్ ఫోకస్
కోరిక వెల్లడించిన జనసేనాని
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనంగా మారారు. తాజాగా ఏపీలో జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన అద్భుత విజయాన్ని సాధించింది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పో\షించారు జస సేనాని.
తన ప్రయత్నం వల్లనే ఇవాళ ఏపీలో కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసిందని టాక్. ఇది పక్కన పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటోడంటూ కితాబు ఇచ్చారు.
ఏపీలో జనసేన పార్టీ సత్తా చాటింది. 21 ఎమ్మెల్యేలతో పాటు 2 లోక్ సభ స్థానాలను గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. 100 శాతం ఫలితాలను సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించారు. ఇదిలా ఉండగా న్యూఢిల్లీ వేదికగా కేంద్ర కేబినెట్ కొలువు తీరింది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్బంగా జనసేన పార్టీ చీఫ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. తనకు డిప్యూటీ సీఎం కావాలని ఉందని తన మనసులోని కోరికను బయట పెట్టారు. మరి చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు.