పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తే ఎలా
బెంగళూరు – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. గురువారం సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా హీరోల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో హీరోలు 40 ఏళ్ల కిందట హీరో అడవులను కాపాడే వారని, అలాంటి కథలు, సినిమాలు వచ్చేవని అన్నారు. ప్రజలకు ఆదర్శ ప్రాయంగా ఉండే వారని తెలిపారు.
కానీ ఇప్పుడు సీన్ మారిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వస్తున్న సినిమాలలో హీరో అడవుల్లో చెట్లను నరకడం, వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడని ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇలాంటి మూవీస్ రావడం పరిపాటిగా మారడం దారుణమన్నారు.
పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్లు అర్థం అవుతోంది. బన్నీ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి.
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.