DEVOTIONAL

అర్చ‌కుల క‌న్నీళ్లు క‌దిలించాయి – ప‌వ‌న్ క‌ళ్యాణ్

Share it with your family & friends

రాముల వారి విగ్ర‌హం త‌ల న‌రికివేత‌పై కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న నంబూరులోని ప్ర‌సిద్ద దేవాల‌యం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి చేరుకున్నారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న తిరుమ‌ల వివాదం, ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ జ‌ర‌గ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తిరుమ‌ల‌కు జ‌రిగిన అప‌చారానికి ప్రాయాశ్చిత్తంగా దీక్ష‌కు శ్రీకారం చుట్టారు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ దీక్ష 11 రోజుల పాటు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఆల‌యానికి భారీ బందోబ‌స్తు మ‌ధ్య చేరుకున్న డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.

రామతీర్థం లో రాముల వారి విగ్రహం తలను నరికేస్తే అర్చకులు విగ్రహం పట్టుకుని ఏడుస్తున్న ఘటన త‌న‌ను ఎంత‌గానో క‌దిలించి వేసింద‌ని చెప్పారు.

ఆరోజు తాను అన్ని మతాల వారు ఖండించాలని పిలుపునిచ్చానని గుర్తు చేశారు. చిలకలూరిపేట ముస్లిం కుటుంబం కూడా ఖండించి మతాలకు అతీతంగా నిలబడ్డారని కొనియాడారు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఏది ఏమైనా కోట్లాది మంది భ‌క్తుల మ‌నో భావాలు దెబ్బ తినేలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. మొత్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి జ‌రిగిన అప‌చారం ప‌ట్ల తాను చింతిస్తున్న‌ట్లు, అందుకే ప్రాయ‌శ్చిత్తంగా దీక్ష‌కు దిగాన‌ని చెప్పారు.