NEWSANDHRA PRADESH

సినిమాలు చేయాలంటే డ‌బ్బులుండాలి

Share it with your family & friends

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌పై స్పందించారు. సినిమాలు చేయాల‌ని ఉంద‌ని , కానీ ఇప్పుడున్న పోస్ట్ అత్యంత బాధ్య‌త‌తో కూడుకుని ఉన్న‌ద‌ని అన్నారు.

సోమ‌వారం ప‌ల్లె పండుగ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం. ఈ సంద‌ర్బంగా సినిమాల‌లో ఏమైనా న‌టించే ఛాన్స్ ఉందా అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న స్పందిస్తూ సినిమాలు చేయాలంటే డ‌బ్బులు ఉండాల‌న్నారు.

ముందు బాధ్య‌త‌లు నిర్వ‌హించాల్సి ఉంది..ఆ త‌ర్వాత సినిమాలు చేస్తాన‌ని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. టాలీవుడ్ లో తాను ఎవ‌రితోను పోటీ ప‌డ‌న‌ని చెప్పారు. అయితే ఇదే స‌మ‌యంలో తెలుగు సినిమా రంగం ప‌చ్చ‌గా క‌ళ క‌ళ లాడుతూ ఉండాల‌ని కోరుకుంటాన‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

సినిమా ప‌రిశ్ర‌మ బాగుండాలంటే డ‌బ్బులు ఉండాల‌ని, ప్ర‌స్తుతం రాష్ట్ర ఖ‌జానా ఖాళీగా ఉంద‌న్నారు. నాకు బాల‌కృష్ణ‌, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ అంటే అభిమాన‌మ‌ని చెప్పారు .