డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీకి షాక్ ఇచ్చారు. జగన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి పాలన ఉన్నంత వరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. సీఎం చంద్రబాబు , తన చేతుల్లో లేదన్నారు. అలా ఇవ్వాలంటే కొన్ని రూల్స్ , రెగ్యులేషన్స్ ఉన్నాయని , తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు పవన్ కళ్యాణ్. తాజాగా తాను చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
సోమవారం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు శాసన సభ నియమవాళిని పాటించాల్సిందేనని , కానీ ముందు నుంచీ గౌరవించకుండా వస్తున్న ఘనత వైసీపీకి వర్తిస్తుందన్నారు.
ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల తరపున మాట్లాడకుండా ఏకంగా గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయడం దారుణమన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యానికి మీరు ఇచ్చే విలువ అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ఎలా ప్రతిపక్ష హోదా దక్కుతుందని అన్నారు.