రాయి దాడి పక్కా నాటకం
నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
అమరావతి – విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రెడ్డిపై జరిగిన దాడి పూర్తిగా నాటకమేనంటూ కొట్టి పారేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ . వారాహి విజయ యాత్రలో భాగంగా జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల్లో కోడి కత్తి, ఆ తర్వాత బాబాయి గొడ్డలి దాడి ప్రస్తుతం రాయి దాడి ఇందులో భాగమేనంటూ ఎద్దేవా చేశారు.
ఒకవేళ తాను అధికారంలో ఉండి కూడా రాయి ఎవరు వేశారో కూడా తెలుసు కోలేని స్థితిలో పాలన సాగిస్తున్నాడా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఇదంతా ప్రజల నుంచి సమస్యలను ఎత్తకుండా చేసేందుకే జగన్ ఆడిన అద్భుత నాటకం అంటూ మండిపడ్డారు.
ఈసారి జగన్ మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఇంకెన్ని మ్యాజిక్కులు ప్రదర్శించినా చివరకు గెలిచేది జనసేన పార్టీ కూటమినేనంటూ గుర్తు పెట్టు కోవాలని అన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టుకుని రాయి దాడి జరిగిందంటే ఎలా అని నిలదీశారు. ఇదంతా నమ్మశక్యంగా లేదంటూ పేర్కొన్నారు జనసేన పార్టీ చీఫ్. ఇకనైనా ప్రజలకు వాస్తవాలు తెలిపితే మంచిదని సూచించారు.