జగన్ యుద్ధానికి సిద్దమేనా
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అరాచక పాలన సాగిస్తున్న సీఎంపై ప్రత్యక్షంగా యుద్దం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు . వైసీపీకి చెందిన ఎంపీ బాల శౌరి తన తనయుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.
అనంతరం జనసేన పార్టీ చీఫ్ ప్రసంగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనంతకు తాను అర్జనుడిగా అనుకుంటున్నారని , ఆయనకు అంత సీన్ లేదని మండిపడ్డారు. మమ్మల్ని జగన్ కౌరవులతో పోల్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఇది కలియుగం..కౌరవులు..పాండవులతో పోల్చుకోవద్దంటూ సూచించారు. అసలు మీకు ఏం కావాలో మీకు తెలియని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. జగన్ పదే పదే సిద్దం అంటున్నారని, ఇంతకు ఆయన ఎవరి కోసం, దేని కోసం సిద్దంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.