జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
అమరావతి – ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం తప్పదన్నారు. ప్రజలు ఇప్పటికే తమను గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు జనసేన పార్టీ చీఫ్.
వైసీపీ అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వై నాట్ 175 అన్నది ఉత్త మాటేనని పేర్కొన్నారు. దోచు కోవడం, దాచు కోవడం తప్ప రాష్ట్రంలో ఒరిగింది ఏమీ లేదన్నారు పవన్ కళ్యాణ్.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు వైసీపీ ఖాళీ కావడం తప్పదన్నారు . ఇది అక్షరాల సత్యమన్నారు. పదే పదే గెలుస్తానని ధీమా వ్యక్తం చేయడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు జనసేన పార్టీ చీఫ్. జగన్ హయాంలో పాలన పడకేసిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన సైనికులు శక్తి వంచన లేకుండా సత్తా చాటాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన అధికారాన్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.