సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నాడంటూ ఆరోపించారు. తాము ఎవరి వద్ద నుంచి డబ్బులను తీసుకోవడం లేదన్నారు. వారంతా స్వచ్చంధంగా విరాళాలు ఇస్తున్నారని తెలిపారు.
తాను ముందే నేతలు, కార్యకర్తలు, అనుచరులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని అన్నారు. ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడితే వారిని గుర్తించి టికెట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. కేవలం పార్టీ కోసం విరాళాలు ఇచ్చినంత మాత్రాన టికెట్లు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
అందుకే తిరిగి చెక్కులను వాపస్ పంపించడం జరిగిందని చెప్పారు. పార్టీ కోసం కష్ట పడిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇప్పటికే పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుందన్నారు. జన సైనికులు, వీర మహిళల కోసం తన వంతుగా మూడున్నర కోట్ల రూపాయలు సాయంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ .
తాము ఆదుకునే మనస్తత్వమని దోచుకునేది కాదన్నారు.