నువ్వు సిద్దం మేం యుద్ధం
పవన్ కళ్యాణ్ కామెంట్స్
అమరావతి – ఏపీ రాష్ట్రం కోసం జాతీయ నాయకులతో చాలాసార్లు తిట్లు తిన్నానంటూ వాపోయారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. జగన్ మోహన్ రెడ్డి సిద్దం అంటున్నారని అయితే తాము కూడా యుద్దానికి సై అంటున్నామని చెప్పారు.
అయితే తమతో పోరాటం చేసే దమ్ము ఏపీ సీఎంకు ఉందా అని ప్రశ్నించారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఓటు చీలకుండా చేసే కసరత్తు కోసమే భీమవరానికి దూరంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.
తప్పుడు కేసులు పెట్టిన వారిని తాము మర్చిపోమన్నారు. అన్నింటిని చక్క బెడతామని, వారి పని పడతామని హెచ్చరించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన , టీడీపీ కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా భీమవరంలో బీజేపీ సీనియర్ నాయకులు పాకా సత్య నారాయణ ఇంటికి వెళ్లారు. ఆయనను కలిశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.