నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కాంమెంట్ చేశారు. రాష్ట్రంలో జరగబోయే శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి దుమ్ము రేపడం ఖాయమని జోష్యం చెప్పారు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు పవన్ కళ్యాణ్. గత కొన్నేళ్ల నుంచి ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం జనసేన ప్రస్తావిస్తూ వస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఎంతో శ్రమకోర్చి పార్టీ బలోపేతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు పాటు పడుతున్నారని కొనియారు. ఇదే స్పూర్తితో ఉన్న కొద్ది రోజుల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.
జనసేన ప్రస్తుతం పొత్తులో భాగంగా 21 స్థానాలలో పోటీ చేస్తుందని తెలిపారు. ఇతర ప్రాంతాలలో పోటీ చేసే కూటమిలోని టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపొందేందుకు కృషి చేయాలని కోరారు జనసేనాని. రాష్ట్రంలో జగన్ పనై పోయిందని, ఆయనను ఇంటికి పంపించేందుకు జనం సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.