జగన్ చాప్టర్ క్లోజ్ – పవన్ కళ్యాణ్
నిప్పులు చెరిగిన జనసేనాని
అమరావతి – ఏపీలో నిన్నటి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి ఇక కాలం చెల్లిందన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడితో కలిసి పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రం బాగు కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, వనరులను కాపాడు కోవడం కోసం తాము ఒక్కటయ్యామని, కూటమిగా ఏర్పడ్డామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. రాచరిక పాలన సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్న జగన్ రెడ్డి ఇక ఇంటికి వెళ్లడమే మిగిలి ఉందన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్యాలెస్ లో ఉంటూ నవ రత్నాల పేరుతో సాగించిన మోసం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. తాము వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదన్నారు. జనసేన కూటమి ఆధ్వర్యంలో జనరంజక పాలన అందిస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
తాము మాటిచ్చామంటే తప్పే రకం కాదన్నారు. ప్రజా సంక్షేమమే తమ ముందున్న లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు జనసేనాని. ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా గమనించాలని, విలువైన ఓటును వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు.