జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం
జనసేనాని పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదెల నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏపీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ కు మూడిందన్నారు. ఆయనకు ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డి ఓ మూర్ఖుడంటూ సీరియస్ కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్.
తనను నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక వైసీపీ మూకలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే తాట తీస్తానంటూ హెచ్చరించారు జనసేన పార్టీ చీఫ్.
వైసీపీ పార్టీ కాదని అది ఓ పంది కొక్కుల గుంపు అంటూ ఎద్దేవా చేశారు. కుట్రలు పన్నడం, వేధింపులకు గురి చేయడం జగన్ కు అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని జనసేన కూటమిని గెలిపించడం ఖాయమని జోష్యం చెప్పారు పవన్ కళ్యాణ్.