డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో తాము సమన్వయంతోనే ముందుకు వెళుతున్నామని చెప్పారు. వెన్ను నొప్పి కారణంగానే తాను సమావేశాలకు హాజరు కాలేక పోయానని తెలిపారు. ఇప్పటికీ నొప్పితో బాధ పడుతున్నానని వాపోయారు. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చే పనిలో ఉందన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. నిబద్దతతో తన శాఖలను నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గురువారం మీడియాతో మాట్లాడారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు.
ఏ ఒక్కరికీ ఇబ్బంది అన్నది లేకుండా చూస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందజేస్తున్నామని చెప్పారు. పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి పెన్షన్స్ ను ఇస్తున్నామని, త్వరలోనే ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. కూటమి సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు.