ఓటు కీలకం జగన్ ప్రమాదం
నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ ల్యాండ్ గాంబ్లింగ్ యాక్ట్ దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విచిత్రం ఏమిటంటే ఇంకోసారి గనుక జగన్ రెడ్డిని గెలిపిస్తే మీ స్వంత ఆస్తులు మీకు కాకుండా పోతాయని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజల ఆస్తులను కాజేసేందుకు భూ చట్టం పేరుతో మోసానికి తెర తీశాడని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఇకనైనా ప్రజలు గమనించాలని, లేక పోతే ప్రమాదంలో పడతారని సూచించారు.
ఇప్పటికే ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గంజాయికి, మాదక ద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ గా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. నేరాలు, ఘోరాలు, దోపీడీలు, మోసాలకు అడ్డాగా మారడం దారుణమన్నారు జనసేనాని.