ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ ప్రసాదానికి అపచారం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కొణిదెల ఆదివారం దీక్షకు శ్రీకారం చుట్టారు. తాజాగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగిన పుణ్య క్షేత్రం తిరుమల వివాదాస్పదంగా మారింది. దీనికి కారణం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడం. ప్రధానంగా తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువులకు సంబంధించిన నెయ్యిని వాడారంటూ సీఎం ఆరోపించించారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ సందర్బంగా లడ్డూ ప్రసాదం కల్తీపై తీవ్రంగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా వదిలి పెట్టబోమంటూ ప్రకటించారు. ఈ మేరకు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారానికి నిరసనగా ఇవాల్టి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా ఇవాళ నంబూరు లోని దశావతార శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడే ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పవణ్ కళ్యాణ్ కొణిదెలకు. ఇదిలా ఉండగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు చేపట్టనున్నట్లు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం.