అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు
భారీ ఎత్తున తరలి వచ్చిన ఫ్యాన్స్
తిరుమల – ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా అలిపిరి మెట్ల మార్గం నుండి తిరుమల కొండకు బయలు దేరారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్. మంగళవారం నేరుగా కుటుంబంతో సహా విజయవాడ నుంచి విమానం ద్వారా తిరుపతికి చేరుకున్నారు. అక్కడ రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి తిరుపతి మెట్ల మార్గం ద్వారా భారీ బందోబస్తు ద్వారా విచ్చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నడుచుకుంటూ తిరుమల కొండపైకి చేరుకోనున్నారు.
అక్టోబర్ 2న బుధవారం శ్రీవారిని దర్శించుకుని తాను గత 11 రోజులుగా చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ధర్మం కోసం తాను ఈ దీక్ష చేపట్టానని అన్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్స్ చేయబోనంటూ ప్రకటించారు.
గత 5-6 ఏళ్లుగా నిత్యం ఏదో ఒక అపవిత్రం జరుగుతోందన్నారు. దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసం చేసినా పట్టించు కోలేదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం.
ఇది కేవలం ఒక ప్రసాదం గురించి కాదు…సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ని ముందుకు తీసుకెళ్లాలనే నిబద్ధత ఈ ‘ప్రాయశ్చిత్ దీక్ష అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల.