NEWSANDHRA PRADESH

బెదిరింపుల‌కు పాల్ప‌డితే కేసులు త‌ప్ప‌వు

Share it with your family & friends

హెచ్చ‌రించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసులు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌పై ఎవ‌రు అనుచిత వ్యాఖ్య‌లు చేసినా లేదా బెదిరింపుల‌కు పాల్ప‌డినా ఊరుకునేది లేద‌ని సుమోటోగా కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ఆదివారం గుంటూరు అరణ్యభవన్ లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగించారు. బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. అధికారులపై ఈగ వాలినా, చిన్న గీత పడినా బెదిరింపులకు దిగినవారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సప్త సముద్రాలు దాటినా, రిటైర్ అయినా వదిలిపెట్టమని ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా స్పందించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులు ఎవరూ వాళ్ల బెదిరింపులకు బెదిరి పోరన్నారు.

20 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని మభ్యపెట్టి గత ప్రభుత్వంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని, రోడ్డు మీద నిరసనను చూస్తున్న మహిళలపై కూడా హత్యాయత్నం కేసులు పెట్టారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉండగా పోలీసులు ఎన్నిసార్లు ఇబ్బందిపెట్టినా బాధ్యతగా వ్యవహరించమని కోరడం తప్ప ఏనాడూ… అంతు చూస్తామని మాట్లాడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు.