NEWSANDHRA PRADESH

ప్ర‌భుత్వ నిర్ణ‌యం డిప్యూటీ సీఎం హ‌ర్షం

Share it with your family & friends

వైద్య కాలేజీకి పింగళి వెంక‌య్య చౌద‌రి పేరు

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్రేద‌శ్ తెలుగుదేశం పార్టీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త దేశ‌పు జాతీయ జెండా (త్రివ‌ర్ణ ప‌తాకం ) రూప‌క‌ర్త ఏపీకి చెందిన పింగ‌ళి వెంక‌య్య చౌద‌రి పేరును చిర‌స్థాయిగా నిలిచి పోయేలా చేయాల‌ని సంక‌ల్పించింది.

ఇందుకు గాను అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌కాలం గుర్తుండి పోయేలా పింగ‌ళి వెంక‌య్య చౌద‌రి పేరును మ‌చిలీప‌ట్నం ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు పేరు పెడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌భుత్వ నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా పింగళి వెంకయ్య మువ్వన్నెల జెండాను జాతికి అందించారని పేర్కొన్నారు.

మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టడం ద్వారా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి భావి తరాలకు అందుతుందని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌.

పింగళి వెంకయ్య పేరును నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఈ సంద‌ర్బంగా ధన్యవాదాలు తెలిపారు ఉప ముఖ్య‌మంత్రి.