పిఠాపురం ప్రజల్ని గుండెల్లో పెట్టుకుంటా
చివరి శ్వాస వరకు మీతోనే ఉంటానన్న పవన్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. దాదాపు 4,400 కోట్లకు పైగా పెన్షన్లను ఒకే రోజు పంపిణీ చేయడం విశేషం.
ప్రభుత్వం కొలువు తీరి కొన్ని రోజులే అయినా ఉద్యోగులు కష్టపడి పెన్షన్లు ప్రతి ఒక్కరికీ అందేలా చేశారని, ఈ సందర్బంగా వారిని అభినందిస్తన్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్ . పిఠాపురం నుంచి పోటీ అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందన్నారు.
తనకు భయం లేదన్నారు. గట్టి వాడినని , అంతకంటే మొండోడినని చెప్పారు. బాధ్యతగా వ్యవహరిస్తే ప్రాణం ఇస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. తనకు చిరస్మరణీయమైన గెలుపును కట్టబెట్టిన పిఠాపురం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని స్పష్టం చేశారు .
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల మేరకు వాటిని ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ పెన్షన్లు అందజేశామన్నారు .