నటుడిగానే కాదు లీడర్ గా నెంబర్ వన్
పవన్ కళ్యాణ్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం
హైదరాబాద్ – పవన్ కళ్యాణ్ నటుడిగా పరిణతి చెందాడు. అంతకు మించి అద్బుతమైన రాజకీయ నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఓటమి పాలైనా వెన్ను చూపలేదు. తను ప్రజలను ప్రేమించాడు. వారి మధ్యనే ఉండేందుకు ప్రయత్నం చేశాడు. సాధ్యమైనంత మేరకు ప్రజా సేవ చేస్తూనే సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తాడు.
జనసేన పార్టీని ప్రజల హృదయాల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. వారాహి యాత్రకు శ్రీకారం చుట్టాడు. జనంతో మమేకమై వారికి తాను ఉన్నానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్.
ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ స్టార్ పెను సంచలనంగా మారి పోయాడు. తను విస్మరించ లేని నాయకుడిగా ఎదిగాడు. గతంలో వైసీపీ ఎన్ని ఇక్కట్లకు గురి చేసినా దట్టించిన తూటాలా ముందుకు కదిలాడే తప్పా వెనక్కి వెళ్ల లేదు . ఇది పవన్ కళ్యాణ్ లో ఉన్న నైజం. తను ముందు నుంచీ అంతే. ఆరోపణలు పట్టించుకోడు. విమర్శలకు జంకడు.
తను అనుకుంటే చాలు..దాని కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఉక్కు సంకల్పం కలిగిన పవన్ కళ్యాణ్ చివరకు సాధించాడు. తను ఏకంగా నటుడిగా సక్సెస్ అయ్యాడు. ఆపై పొలిటికల్ లీడర్ గా అందనంత ఎత్తుకు ఎదిగాడు. నటనా పరంగా వంద మార్కులు సాధించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కూడా జనం ఆదరణ పొందుతున్నాడు.