గిరిజన సహకార సంస్థ పనితీరు సూపర్
కితాబు ఇచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి
విశాఖపట్నం – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన ఉత్పత్తులు బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు. ఇదిలా ఉండగా బుధవారం జీసీసీ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ఎత్తున ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ స్టాళ్లను సందర్శించారు.
గిరిజన సహకార సంస్థ (GCC) దాదాపు 50కి పైగా ఉత్పత్తులను ప్రదర్శించారు. వీటిని గిరిజనుల నుండి నేరుగా సేకరించిన కుంకుడు కాయలు, నన్నారి, కరక్కాయలు, తేనె, కాఫీ గింజలు, ఇతర ఉత్పత్తులు ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనలో భాగంగా గిరిజన సహకార సంస్థ అధికారులు ఉత్పత్తులను గిరిజనుల నుండి క్రమబద్ధమైన విధానంలో సేకరిస్తూ, వారికి ఉపాధి అవకాశాలు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సేంద్రీయ విధానంలో, అత్యంత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఉన్నత ప్రమాణాలతో సేకరణ నుండి, ప్యాకింగ్ వరకు సంస్థ పని చేస్తుందని వివరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గిరిజన సహకార సంస్థ నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులు అందిస్తూ, గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను, తీసుకుంటున్న చర్యలను అభినందించారు .
అంతే కాకుండా గిరిజనుల జీవితాలు మెరుగు పరిచేలా వారు చేస్తున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తూ, ఆర్దికంగా కూడా వృద్ధి సాధించే దిశగా పనిచేయాలని సూచించారు.