29న కొండగట్టుకు పవర్ స్టార్
తాను నమ్ముకున్న దేవుడి కోసం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తన ఆరాధ్య దైవమైన తెలంగాణలో కొలువు తీరిన కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించు కోనున్నారు.
ఆయనకు ఆంజనేయుడంటే విపరీతమైన అభిమానం. తనకు శక్తిని , బుద్ది బలాన్ని స్వామి వారిని దర్శించుకుంటే కలుగుతాయని పవన్ కళ్యాణ్ నమ్మకం. సినిమాలలో నటించినప్పటి నుండి కూడా కొండగట్టును డిప్యూటీ సీఎం సందర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా ఏపీ రాష్ట్రంలో జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. 175 స్థానాలకు గాను కూటమి ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. ఇక పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు దక్కాయి.
ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా ఆయన ఏకంగా డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత బిజీగా ఉండడంతో రాలేక పోయారు . ఈనెల 29న కొండగట్టును దర్శించుకుని పూజలు చేశారు.