DEVOTIONAL

కుక్కుటేశ్వ‌ర గుడిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్

Share it with your family & friends

పురోహుతిక అమ్మ వారి ద‌ర్శ‌నం

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బుధ‌వారం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని సంద‌ర్శించారు. ఇందులో భాగంగా పిఠాపురంలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరు పొందిన శ్రీ పురోహుతిక అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.

అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు అమ్మ వారి చిత్ర‌ప‌టాన్ని అంద‌జేశారు ఆల‌య పూజారులు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఎమ్మెల్యేగా ప్రజల ముందు మరోసారి ప్రమాణం చేశారు పవన్‌ కల్యాణ్‌. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు. నన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని అన్నారు. అసెంబ్లీ గేటు తాకడం కాదు.. గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లాం. వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ విజయం సాధించామ‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.