ఆక్స్ ఫర్డ్ స్టోర్ లో పవన్ కళ్యాణ్
ధన్యవాదాలు తెలిపిన సంస్థ
ఢిల్లీ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదల ఢిల్లీలో సందడి చేశారు. ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో 100 శాతం ఫలితాలు సాధించాడు. ఇదే సమయంలో తాజాగా మరాఠాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేపట్టిన ఏడు నియోజకవర్గాలలో మహాయుతి కూటమి అభ్యర్థులు గెలుపొందారు. అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు.
దీంతో చర్చనీయాంశంగా మారాడు. అంతే కాదు పవన్ కళ్యాణ్ పర్ ఫార్మెన్స్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇదే సమయంలో తళుక్కున మెరిశారు ఢిల్లీలో. కేంద్ర పర్యాటక మంత్రితో భేటీ అయ్యారు. ఎవరూ ఊహించని రీతిలో ఆయన ఢిల్లీలో పేరు పొందిన ఆక్స్ ఫర్డ్ బుక్ స్టోర్ ను సందర్శించారు.
ఈ సందర్బంగా సదరు స్టోర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పవన్ కళ్యాణ్ పుస్తకాలను చూస్తున్న ఫోటోను షేర్ చేసింది. పుస్తకాలంటే ముందు నుంచీ పవన్ కళ్యాణ్ కు ఇష్టం.