బాధితులకు భరోసా డిప్యూటీ సీఎం ఆసరా
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలలో
అమరావతి – ఏపీని అతలాకుతలం చేసిన వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. సోమవారం ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటించారు.
కాకినాడ జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో ఏలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గం లోని గొల్లప్రోలులో ఉన్న వై.యస్.ఆర్ కాలనీకి వెళ్ళే మార్గం ముంపు పరిస్థితిని పరిశీలించారు.
పడవలో వెళ్లి కాలనీలో చిక్కుకున్న ప్రజలను కలిశారు పవన్ కళ్యాణ్. వీధుల్లో పర్యటించి వరద వల్ల ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. పర్యటన అనంతరం, 400 వరద ప్రభావిత పంచాయతీ ఖాతాలకు నేరుగా ఒక్కో పంచాయతీకి ఒక్కొక్క లక్ష చొప్పున అందజేసే కార్యక్రమాన్ని సమీక్షించడానికి బయలు దేరారు.
ఇదిలా ఉండగా ఏపీ , తెలంగాణ రాష్ట్రాలకు వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు రూ. 6 కోట్లు సాయం ప్రకటించారు. ఒక కోటి రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి అందజేశారు. మరో వైపు సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు.