పవన్ కళ్యాణ్ దే పిఠాపురం
వంగా గీతపై 61,152 ఓట్ల తేడా
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయాన్ని సాధించారు. ఇంతకు ముందే ప్రచారం సందర్భంగా చెప్పినట్లు తన గెలుపును ఏ శక్తి అడ్డు కోలేదంటూ ప్రకటించారు. తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 61,152 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎవరూ ఊహించని రీతిలో ప్రజలు గంపగుత్తగా చంద్రబాబు నాయుడు కూటమికి పట్టం కట్టారు. ఇచ్చిన హామీల మేరకు తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రా, రాయలసీమ , కోస్తాంధ్ర ప్రాంతాలలో బిగ్ షాక్ ఇచ్చారు కూటమి అభ్యర్థులు. ఇదిలా ఉండగా కీలకమైన మంత్రులలో చాలా మంది ఓటమి పాలయ్యారు. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ , భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా గెలుపొందారు.
విశాఖ ఉత్తర కూటమి బీజేపీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజు ఆధిక్యంలో కొనసాగుతుండగా నరసాపురం కూటమి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విక్టరీ సాధించారు. భీమవరం కూటమి జనసేన అభ్యర్థి పులపార్తి ఆంజనేయులు విజయం సాధించారు.