నరేంద్ర మోడీ దేశానికి స్ఫూర్తి
ప్రకటించిన జనసేన చీఫ్ పవన్
న్యూఢిల్లీ – నరేంద్ర మోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. శుక్రవారం ఢిల్లీలో ఎన్డీయే, భారతీయ జనతా పార్టీ సంయుక్త పార్లమెంటరీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ దేశానికి ప్రధానిగా మోడీ సేవలు అవసరమని పేర్కొన్నారు. ఆయన అద్భుతమైన నాయకుడు అంటూ కొనియాడారు. ఆయన ఎల్లకాలం చల్లంగా ఉండాలని కోరారు. మోడీ పీఎంగా ఉన్నంత కాలం మన దేశం ఎవరికీ తల వంచదన్నారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా శుక్రవారం ఎన్డీయే, బీజేపీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సమావేశానికి కీలకంగా మారారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో పాటు సీఎం నితీశ్ కుమార్ . ఇరు వైపులా ఇద్దరూ కూర్చున్నారు.