ఆలయాలు సంస్కృతికి వారధులు – పవన్ కళ్యాణ్
దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం వెల్లి విరియాలి
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. యావత్ దేశ వ్యాప్తంగా ఆలయాలు కళ కళ లాడాలని, నిత్యం పూజలు, ధూప దీప నైవేద్యాలతో కొనసాగాలని పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా ఏపీలో పల్లె పల్లెలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని , ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా ఆయన ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆలయాల ప్రాశస్త్యం గురించి తెలియ చేశారు.
చరిత్ర అంతటా వెతికితే భారతదేశం మన సరిహద్దుల దాటి సంస్కృతులలో, దేవాలయాలు ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధానికి స్పూర్తిదాయక ఉదాహరణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రదేశాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనలను అనుసంధానించడమే కాకుండా వాటి గోడలలో జ్ఞానాన్ని కలిగి ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్ .
దేవాలయాలను హబ్‌లుగా మార్చడం ద్వారా, సంస్కృతి , విజ్ఞానం కోసం ప్రజలు కలిసి అభ్యాసం , సమాజ కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం ద్వారా, శాస్త్ర , ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేయడం ద్వారా సంప్రదాయం, ఆవిష్కరణల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా మన సమాజాన్ని రూపొందించడంలో వాటి ప్రాముఖ్యతను పునరుద్ధరించవచ్చు అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ శాశ్వతమైన సంపదలను పెంపొందించు కునేందుకు సన్నద్ధం కావాలని అన్నారు.