NEWSANDHRA PRADESH

అర్ధ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గాలి

Share it with your family & friends

ఏపీ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్

అమ‌రావ‌తి – రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ శాస‌న స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

బుధ‌వారం టీడీఎల్పీ లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల బాధ్యతలు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్బంగా ప‌య్యావుల కేశ‌వ్ మాట్లాడారు. శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. జవాబుదారీ తనం తో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు.

శాసన సభ కార్యదర్శి పిపికే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె. రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏవో కె. పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు, తదితరులు పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియ జేశారు.