NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న ప‌య్యావుల

Share it with your family & friends

ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి ఆగ్ర‌హం

అమ‌రావ‌తి – వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఏపీ రెవిన్యూ , శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. జ‌గ‌న్ రెడ్డిని ఆర్థిక ఉగ్ర‌వాది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆర్థిక ఉగ్రవాది ఏం చేశారో గత ఐదేళ్లలో చూశామని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. బడ్జెట్‌పై ఆయన శాసనసభలో ప్రసంగించారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని మండిప‌డ్డారు ప‌య్యావుల కేశ‌వ్.

గత ప్రభుత్వ వైఖరితో అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటే ప‌ట్టించు కోలేద‌ని జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టడం దారుణ‌మ‌న్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. పోలవరం పనులు నిలిపివేసి డయాఫ్రం వాల్‌ విధ్వంసానికి కారణమయ్యారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అని పయ్యావుల కేశవ్ .

అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది నువ్వు కాదా ఆర్థిక ఉగ్ర‌వాదీ అంటూ సెటైర్ వేశారు. ఆయ‌న చేసిన నిర్వాకం కార‌ణంగా ఏపీ కొన్నేళ్లుగా వెనుక‌బాటుకు గురైంద‌ని వాపోయారు.