జగన్ రెడ్డికి శ్రీవారిపై నమ్మకం లేదు
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
అమరావతి – ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచీ దేవాలయాల పట్ల , దేవుళ్ల పట్ల నమ్మకం అనేది మాజీ సీఎంకు లేదన్నారు. అందుకే తిరుమల పుణ్య క్షేత్రాన్ని కావాలని నిర్వీర్యం చేశారని, నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
అంతే కాదు నాస్తికులను, అన్య మతస్తులను టీటీడీ చైర్మన్లుగా నియమించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు పయ్యావుల కేశవ్. కోట్లాది మంది భక్తులు కలిగి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు.
విశ్వాసం లేని వ్యక్తుల గురించి మాట్లాడటం వేస్ట్ అని పేర్కొన్నారు. ఓ వైపు హిందువుల మనో భావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని భావిస్తుంటే జగన్ రెడ్డి కావాలని ఫేక్ ప్రచారానికి తెర తీశాడని ధ్వజమెత్తారు పయ్యావుల కేశవ్.
ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి మారుతాడని అనుకున్నామని, కానీ తన మనసు మార్చు కోలేక పోవడం బాధగా ఉందన్నారు. ఎందుకు తిరుపతికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు .