జగన్ రెడ్డిపై పయ్యావుల కేశవ్ కామెంట్స్
అమరావతి – తిరుమల విశిష్టత గురించి ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడారు. తిరుమల వ్యవహారంలో సిట్ విచారణ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
వెంకటేశ్వరస్వామి తనకు పునర్మజన్మ ఇచ్చారని చంద్రబాబు నాయుఅనేకసార్లు చెప్పిన విషయం జగన్ గుర్తుంచు కోవాలని అన్నారు. లీడర్, క్యాడర్ విడిచిపెట్టి పోతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో జగన్ విల విలలాడుతున్నాడని ఎద్దేవా చేశారు పయ్యావుల కేశవ్.
దేవుడిని నమ్ముతున్నానని జగన్ ఒక్క మాట ఎందుకు చెప్పలేక పోతున్నాడని నిలదీశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తోందని కొండకు వెళ్ళని జగన్ రెడ్డికి తమను ప్రశ్నించే అధికారం లేదన్నారు . సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ తన అలోచనలను ప్రజల ముందు ఉంచారని చెప్పారు .
పపన్ కల్యాణ్ మంచి ఆలోచనలపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను జగన్ నాశనం చేశారని ఆరోపించారు పయ్యావుల కేశవ్.
టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశాడని మండిపడ్డారు. సెట్టింగ్ లు వేసి తిరుమలేశుడిని ఇంటికి రప్పించుకున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. పాపం పండే రోజు తప్పకుండా వస్తుందన్నారు.