బౌలర్ల ప్రతాపం పంజాబ్ పరాజయం
సీఎస్కే బౌలర్లు అద్బుత ప్రదర్శన
ధర్మశాల – ఐపీఎల 2024లో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోర్ చేసినప్పటికీ ఎక్కడా తగ్గలేదు ఆ జట్టు. ప్రధానంగా బౌలర్లు కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశారు. దీంతో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చతికిల పడింది.
ఇక మరోసారి జిడ్డూ మ్యాజిక్ చేశాడు. తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదుర్స్ అనిపించేలా చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో స్కోర్ బోర్డు పెరిగేలా చేశాడు. ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ రేసులోకి వెళ్లింద చెన్నై సూపర్ కింగ్స్. పంజాబ్ జట్టును 28 పరుగుల తేడాతో ఓడించింది. జిడ్డూ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే తుషార్ 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. సిమర్ జిత్ సింగ్ 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం విశేషం. ఇక రవీంద్ర జడేజా 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 రన్స్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.