స్వంత గడ్డపై వరుసగా ఐదో ఓటమి
ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగింది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేతిలో ఓటమి పాలైంది. స్వంత గడ్డపై ఇది వరుసగా ఐదో ఓటమి. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలుపొందాల్సిన ఈ మ్యాచ్ ను చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. బౌలర్ యుజ్వేందర్ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీశాడు. సమిష్టి ఆట తీరుతో పంజామ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెన్నై నిర్దేశించిన టార్గెట్ 191 ను 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అయ్యర్ దంచి కొట్టాడు.
41 బంతులు ఆడి 72 రన్స్ చేశాడు. 5 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. ప్రభ్ సిమ్రన్ సింగ్ 36 బాల్స్ లో 5 ఫోర్లు 3 సిక్సులు కొట్టాడు. సీఎస్కే బౌలర్లు పతిరణ 45 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా ఖలీల్ 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చెన్నై 19.2 ఓవర్లలో 190 రన్స్ చేసింది. సామ్ కరన్ 47 బంతులు ఆడి 88 రన్స్ చేశాడు. 9 ఫోర్లు 4 సిక్స్ లు కొట్టాడు. బ్రెవిస్ 32 రన్స్ చేశాడు. యుజ్వేంద్ర చాహల్ కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశాడు సీఎస్కేను. కేవలం 32 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో తొలి హ్యాట్రిక్ కొట్టాడు. అర్ష్ దీప్ 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా యాన్సెన్ 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.