18 పరుగుల తేడాతో పంజాబ్ విక్టరీ
ఐపీఎల్ 2025 టోర్నీ లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. చెన్నై సూపర్ కింగ్స్ పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 219 రన్స్ చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై చతికిలపడింది. కేవలం 201 పరుగులు మాత్రమే చేసింది. ధోనీ క్రీజులో ఉన్నా ఆశించిన మేర ఆడలేక పోయాడు. ప్రియాన్ష్ ఆర్య దుమ్ము రేపాడు. 42 బంతుల్లో 103 రన్స్ చేశాడు. 7 ఫోర్లు 9 సిక్స్ లు ఉన్నాయి.
శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు 3 సిక్స్ లు కొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే జట్టులో కాన్వే 69 , దూబే 42, ధోనీ 27 రన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫెర్గుసన్ 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు యంగ్ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రౌండ్ మొత్తం కళ్లు చెదిరే షాట్స్ తో హోరెత్తించాడు. తమ హోం గ్రౌండ్ లో ఉతికి ఆరేశాడు. పంజాబ్ గెలుపొందడంతో సెన్సేషన్ సెంచరీతో ఆకట్టుకున్న ప్రియాన్ష్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.