|పంజాబ్ కమాల్ గుజరాత్ ఢమాల్
చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్
అహ్మదాబాద్ – ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన రీతిలో విజయాన్ని నమోదు చేసింది. చివరి దాకా ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆది లోనే వికెట్లను కోల్పోయింది. కానీ అనూహ్యంగా శశాంక్ సింగ్ దెబ్బకు గుజరాత్ ఆశలు ఆవరై పోయాయి.
పంజాబ్ గెలుపులో కీలకమైన పాత్ర పోషించాడు. 61 విలువైన పరుగులు చేసి గట్టెక్కించాడు. అతడికి తోడు అశుతోష్ రాణా మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 31 రన్స్ చేశాడు. దీంతో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించారు శశాంక్ సింగ్ , అశుతోష్ రాణా.
గుజరాత్ టైటాన్స్ కు స్వంత మైదానంలో ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు కోసం 7 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ శశాంక్ దగ్గరుండి జట్టును గెలిపించాడు. ఇక పంజాబ్ జట్టులో ధావన్ 1 రన్ చేస్తే బెయిర్ స్టో 22 , ప్రభ సిమ్రాన్ సింగ్ 35 , సామ్ 5 రన్స్ చేశాడు. గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్ మన్ గిల్ మరోసారి మెరిశాడు. స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు.